బీజేపీతో పొత్తున్నా మల్కాజ్ గిరి ఎంపి టికెట్ నా కొడుకుదే: మల్లారెడ్డి

బీజేపీతో పొత్తున్నా మల్కాజ్ గిరి ఎంపి టికెట్ నా కొడుకుదే: మల్లారెడ్డి

బీజేపీతో తమ ఎమ్మెల్యేలు టచ్ లో లేరని అంటూనే..బీజేపీతో ఒకవేళ పొత్తున్నా మల్కాజ్ గిరి టికెట్ తన కొడుకు భద్రా రెడ్డిదేనన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి.  తన కొడుకుకు టికెట్ ఇస్తే..కుటుంబం అని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. తన అల్లుడి కుటుంబం.. తన కుటుంబం వేరన్నారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్ లో లేరన్నారు. కొన్ని రోజుల తర్వాత బీజేపీ,కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ దగ్గరికే వస్తారన్నారు మల్లారెడ్డి.  బీజేపీతో అయ్యేది లేదు పొయ్యేది లేదన్నారు. 

 మరో వైపు  బీఆర్ఎస్ తో  ఎలాంటి పొత్తు ఉండబోదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు,ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని ఇవాళ వ్యాఖ్యానించారు. తమ పార్టీ 17కు 17 సీట్లు గెలుస్తుందని.. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యేనని చెప్పారు. బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ టికెట్ కూడా రాదన్నారు.