త్వరలో పులి బయటకొస్తది.. ఆట మొదలు పెడ్తది: మల్లారెడ్డి

త్వరలో పులి బయటకొస్తది.. ఆట మొదలు పెడ్తది: మల్లారెడ్డి

త్వరలోనే రాష్ట్రంలో పులి బయటకు వస్తోందని అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇక ఆట మొదలు పెడుతుందన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి సీటను భారీ మెజారిటితో గెలిపించుకోవాలని అన్నారు మల్లారెడ్డి. తెలంగాణ భవన్ లో జరిగిన..మల్కాజిగిరి పార్లమెంట్ సమీక్షా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి.

ఇప్పటికే కేసీఆర్ ను పులితో పోల్చిన బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పులి బయటకొస్తే..చెట్టుకు వేలాడదీస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని కూడా చెప్పారు.