యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా.. అగ్రికల్చర్ కమిషనరేట్ దగ్గర ఉద్రిక్తత..

యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా.. అగ్రికల్చర్ కమిషనరేట్ దగ్గర ఉద్రిక్తత..

తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. శనివారం ( ఆగస్టు 30 ) అసెంబ్లీ సమావేశాల అనంతరం బషీర్ బాగ్ లోని అగ్రికల్చర్ కమిషనరేట్ ఎదుట ధర్నాకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసెంబ్లీ నుంచి ర్యాలీగా బయలుదేరి అగ్రికల్చర్ కమిషరేట్ కు బయల్దేరారు నేతలు. కమిషనరేట్ లో అగ్రికల్చర్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించిన అనంతరం ధర్నాకు దిగారు నేతలు.

కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అగ్రికల్చర్ కమిషనరేట్ బయట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసేందుకు బస్సును సిద్ధంగా ఉంచారు పోలీసులు. 

►ALSO READ | నిజామాబాద్ జిల్లాలో 41,098 ఎకరాల పంట నష్టం..

ఇదిలా ఉండగా మీడియాతో మాట్లాడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. పదేళ్లలో ఎప్పుడూ లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చిందని.. యూరియా ఏమైనా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణలో ఏం జరుగుతుందో మాకు తెలియాలని అన్నారు.