
- దెబ్బతిన్న 80 కిలోమీటర్లు రోడ్లు.. రూ.17 కోట్ల నష్టం
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో రెండు రోజుల్లో నమోదైన18 సెంటీమీటర్ల భారీ వర్షం తీవ్ర నష్టం కలిగించింది. పంట పొలాలతో పాటు రోడ్లు దెబ్బతిన్నాయి. 21 మండలాల్లో 41,098 ఎకరాల్లో 20,660 మంది రైతుల పంటలకు నష్టం వాటిల్లినట్లు అగ్రికల్చర్ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 28,131 ఎకరాల వరి పంట, 12,054 ఎకరాల్లో సోయాబీన్ , 565 ఎకరాల జొన్న, 252 ఎకరాల్లో కూరగాయలు, 81 ఎకరాల పత్తి దెబ్బతిన్నాయి. 11 మండలాల్లోని 1,021ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి.
42 రోడ్లు శిథిలం
భారీ వర్షాలు, వరదల ప్రభావంతో జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీకి చెందిన మొత్తం 42 రోడ్లు దెబ్బతిని రూ.17 కోట్ల నష్టం వాటిల్లింది. 264 కరెంట్ పోల్స్ ధ్వంసం కాగా 92 ట్రాన్స్ఫారాలు పడిపోయి ఎన్పీడీసీఎల్రూ. 30 లక్షల నష్టపోయింది. రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నీరు విలేజ్‌ను తాకింది. మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. నది పరివాహక ప్రాంతంలో పంట పొలాలన్నీ నీట మునిగాయి.