జూబ్లీహిల్స్ గెలుపు...రేవంత్ పాలనకు ఆమోదం కాదు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు

జూబ్లీహిల్స్ గెలుపు...రేవంత్ పాలనకు ఆమోదం కాదు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు
  • బీఆర్​ఎస్ ​ఎమ్మెల్సీ దాసోజు 

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​ గెలుపేమీ రేవంత్​ పాలనకు ప్రజల ఆమోదం కాదని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఘన విజయం సాధించినట్టు రేవంత్​ భావిస్తున్నారని, ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమని తెలిపారు. 

ఎన్నో ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​పార్టీ గతంలో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తుచేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. సీఎం,15 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్యకర్త నుంచి డీజీపీ వరకు ఎన్నికల కోసం పని చేశారన్నారు. అసదుద్దీన్​తో బోగస్​ ఓట్లు వేయించారని ఆరోపించారు.