
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: బీసీ 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్పించేలా పార్లమెంట్లో ఆందోళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవ ణ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత లేకుండా కులగణన చేసిందని, రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా రిపోర్టును సీక్రెట్‌గా పెట్టిందని విమర్శించారు.
కులగణన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కేబినెట్ బీసీలను మోసం చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి రిపోర్ట్‌లను పబ్లిక్ డొమైన్స్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.