బీజేపీ 119 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయం : కవిత

బీజేపీ 119 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయం : కవిత

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 119 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోతుందన్నారు ఎమ్మెల్సీ కవిత.  బీఆర్ఎస్ ను బీజేపీ నేర్చుకుంటుందని.. తెలంగాణ పథకాలను స్ఫూర్తిటగా తీసుకుని  మోదీ దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని అన్నారు. బీజేపీకి కమిట్ మెంట్ ఉంటే రాష్ట్రం కోసం పనిచేయాలి కానీ..  అనవసరమైన అడ్డంకులు సృష్టించొద్దని హెచ్చరించారు. 

బీఆర్‌ఎస్ 2023 ఎన్నికల మేనిఫెస్టోను  విడుదల చేసినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు కవిత.  ఇది రాష్ట్రానికే కాకుండా దేశాన్ని విభిన్నంగా తీర్చిదిద్దే మేనిఫెస్టో అని తెలిపారు.  బీఆర్ఎస్  మేనిఫెస్టో వెలువడగానే బీజేపీ.. కాంగ్రెస్  భయాందోళనలకు గురయ్యాయని కవిత ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ ఇస్తున్న హామీలు టిష్యూ పేపర్స్ తో సమానమని.. ఎందుకంటే వాళ్లు అధికారంలోకి వస్తారనే గ్యారంటీ  లేదన్నారు.  ఎవరివి మేనిఫేస్టో చిత్తు కాగితమో ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.