కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీలు

కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీలు

చేవెళ్ల, వెలుగు :  చేవేళ్ల మండలంలోని బీఆర్‌‌ఎస్‌కు చెందిన పలువురు కార్యకర్తలు, నేతలు గురువారం కాంగ్రెస్‌లో  చేరారు. చేవేళ్ల మండల పరిధి చన్‌పల్లి ఎంపీటీసీ మమతారెడ్డి, ఆలూరు ఎంపీటీసీ వడ్ల నరేందర్ చారి చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

 రేవంత్‌రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు.  అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎంపీటీసీలకు అధిక నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్​లో తగిన గుర్తింపు లేకనే పార్టీని వీడుతున్నట్లు ఎంపీటీసీలు  తెలిపారు.