- కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్రావు
కరీంనగర్ సిటీ, వెలుగు: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు కరీంనగర్ అభివృద్ధిని విస్మరించి భ్రష్టు పట్టించారని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు విమర్శించారు. శుక్రవారం కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆయన సమక్షంలో బీఆర్ఎస్ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రే రాజు లావణ్య, 50వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొత్త అనిల్, బీజేపీకి చెందిన మహేందర్, డివిజన్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిద్దామని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరవేసి తీరుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్లు అర్ష మల్లేశం, మల్లికార్జున రాజేందర్, లీరడ్లు కర్రే బీరయ్య పాల్గొన్నారు.
