మేడిగడ్డ పర్యటనకు బయలుదేరిన బీఆర్‌ఎస్‌ బృందం

మేడిగడ్డ పర్యటనకు బయలుదేరిన బీఆర్‌ఎస్‌ బృందం

రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మర్చిపోయి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వాస్తవాలు చెప్పడానికే చలో మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నామని చెప్పారు. రైతుల ప్రయోజనం ముఖ్యం కాదు రాజకీయ ప్రయోజనాలే కాంగ్రెస్ పార్టీకి కావాలని ఫైరయ్యారు. 

మేడిగడ్డ రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. బాధ్యలపై చర్యలు తీసుకోవాలని... రైతులను బలి చేయవద్దన్నారు. ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని చెప్పారు బీఆర్ఎస్ సీనియర్ నేత , ఎమ్మెల్యే పోచారం. బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి చేసి వలసలు ఆపామన్నారు. 

మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారని ఆరోపించారు పోచారం. రాజకీయాల కోసం రైతులను పణంగా పెట్టవద్దని చెప్పారు. 5 బస్సుల్లో మేడిగడ్డ బయల్దేరారు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మాజీ మంత్రి , ఎమ్మెల్యేలు హరీశ్ రావు,  MLA వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కారులో మేడిగడ్డ వెళ్తున్నారు.