హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్అన్నారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో గ్రేటర్హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మాగంటి సునీత గెలుపు కోసం నేతలంతా కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘ఏదైనా అడిగితే ఫ్రీ బస్సు ఇచ్చాం కదా అని చెబుతున్నారు.
ఆడవాళ్లకు ఫ్రీ ఇస్తున్నారు.. మగవాళ్లకు డబుల్ రేటు పెట్టారు. కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇంటికి వస్తే ప్రజలు బాకీకార్డు చూపించి హామీ గురించి ప్రశ్నించాలి’ అని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే చిన్న షాక్ఇవ్వాల్సిందేనన్న ఆయన..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్గెలుపు ఏకపక్షమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఖైరతాబాద్, శేరి లింగంపల్లి నియోజకవర్గాల్లోనూ ఉపఎన్నికలు తప్పవని చెప్పారు. వాటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ ఉపఎన్నికలు ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు.
