ఢిల్లీ నిర్ణయాలు కావాలో.. గల్లీ నిర్ణయాలు కావాలో .. ప్రజలే నిర్ణయించుకోవాలి: సత్యవతి

ఢిల్లీ నిర్ణయాలు కావాలో.. గల్లీ నిర్ణయాలు కావాలో .. ప్రజలే నిర్ణయించుకోవాలి: సత్యవతి

మహబూబాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలువుతున్నాని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ నెల 27న మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 సిఎం కెసిఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. పేద ప్రజల కోసం సిఎం కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు సిఎం కెసిఆర్ ఆర్థిక సాయం చేసి అండగా నిలబడ్డారని.. కెసిఆర్ పాలనలో కరువనేదే లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతుల నీళ్ల కష్టాలు తీర్చారన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ..ప్రజలను మోసం చేసే పార్టీలేన్నారు.

రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించిన నాయకుడు కేసీఆర్ అని.. ఇంకా అభ్యర్థులను ప్రకటించని దుస్థితిలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్,  బిజెపి నిర్ణయాలు ఢిల్లీలో ఉంటాయని.. బిఆర్ఎస్ నిర్ణయలు మన గల్లీలోనే ఉంటాయని తెలిపారు. ఢిల్లీ గులాములు కావాలో మన నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని మంత్రి చెప్పారు.