BRSకు మరో షాక్ : కాంగ్రెస్ పార్టీలోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

BRSకు మరో షాక్ : కాంగ్రెస్ పార్టీలోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సముఖత వ్యక్తం చేశారు. శుక్రవారం ( జులై 12) తన  అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతానని సీఎంకు ప్రకాష్‌గౌడ్ తెలిపినట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు మునిసిపల్ చైర్మన్ , కార్పొరేట్లర్లు , ఎంపీపీలు కాంగ్రెస్  జండా కప్పుకోనున్నారు. 

తెలంగాణలో telangana కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని...  పార్లమెంటు ఎన్నికల తర్వాత కూలిపోతుందని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. నెలరోజుల క్రితమే రాజేందర్‌నగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి  కాంగ్రెస్‌పార్టీలో చేరేందుకు సంసిద్ధత తెలిపారు. శుక్రవారం ( జులై 7)  అనుచరులతో కలిసి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.

గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్‌‌ఎస్‌ ముఖ్య నాయకులు పదేపదే వ్యాఖ్యలు చేస్తుడటంతో తాము గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని రేవంత్‌ గతంలో వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్‌, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి వారు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ పీఠాలు, మునిసిపల్ పీఠాలు కాంగ్రెస్ వశమయ్యాయి. జిల్లా స్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.