అభివృద్ధి ముందుకెళ్లాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలె : కేటీఆర్

అభివృద్ధి ముందుకెళ్లాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలె : కేటీఆర్

హైదరాబాద్‌ చుట్టుపక్కలే కాదు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువ పెరిగిందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌(టీబీఎఫ్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.   ఎవ్వరూ భూములు అమ్మకోవద్దని కొనుక్కోవాలని తాను 2014లో టీబీఎఫ్‌ సమావేశానికి వచ్చినప్పుడు చెప్పినట్లుగా కేటీఆర్ గుర్తుచేశారు.  రాష్ట్రంలో జరుగుతన్న అభివృద్ధి ముందుకెళ్లాలంటే  మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని కోరారు.  

తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చాక  సాగు, తాగు నీరు, కరెంటు సమస్యలపై ఫోకస్ చేశామన్న కేటీఆర్..  మూడోసారి అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ డెవలప్ మెంట్ పై దృష్టి పెట్టబోతున్నామని తెలిపారు. చిన్న, మధ్యతరగతి బిల్డర్లకు అగ్నిమాపక, ఇతరత్రా నాలుగు విభాగాల అనుమతులు సింగిల్‌ విండో విధానంలో వచ్చేలా చూస్తామని కేటీఆర్ చెప్పారు.  హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెరగడం లేదని  ఓటు వేయకపోతే ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌  ఫైన్ వేస్తే పరిస్థితి ఏమైనా మారుతుదో అని  కేటీఆర్ చెప్పారు.  

కర్ణాటకలో  40 శాతం కమీషన్‌ అనే ఆరోపణలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే..  ఇప్పుడు అక్కడి పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లు అయిందన్నారు.  ల్డర్లకు స్పెషల్‌ టాక్స్‌ చదరపు అడుగుకు రూ.500తో ఆ 40 శాతం కాస్తా 400 శాతం అయిందని ఆరోపించారు.