మాక్ అసెంబ్లీ పేరుతో బీఆర్ఎస్ టైంపాస్...కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఫైర్

మాక్ అసెంబ్లీ పేరుతో బీఆర్ఎస్ టైంపాస్...కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఫైర్
  • ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేదా

హైదరాబాద్, వెలుగు: మాక్ అసెంబ్లీ పేరుతో బీఆర్ఎస్ టైంపాస్​ చేస్తూ ప్రజా సమస్యలను విస్మరిస్తుందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం బీఆర్ఎస్ నేతలకు లేదని, అందుకే వారు తమ పార్టీ కార్యాలయంలో మాక్ అసెంబ్లీ పెట్టుకున్నారని విమర్శించారు.

శాసనసభలో జరుగుతున్న చర్చల్లో పాల్గొంటే తమ పదేండ్ల పాలనలో జరిగిన​అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే భయంతో వారు అసెంబ్లీ నుంచి కావాలనే సస్పెండ్ అయి, మాక్ అసెంబ్లీ పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.