పదేండ్ల అభివృద్ధి, రెండేండ్ల అరాచకానికి మధ్య ఎన్నిక ..జూబ్లీహిల్స్‌‌‌‌లో బీఆర్ఎస్ గెలుపుతో కాంగ్రెస్‌‌‌‌కు కనువిప్పు కలగాలి: కేటీఆర్

పదేండ్ల అభివృద్ధి, రెండేండ్ల అరాచకానికి మధ్య ఎన్నిక ..జూబ్లీహిల్స్‌‌‌‌లో బీఆర్ఎస్ గెలుపుతో కాంగ్రెస్‌‌‌‌కు కనువిప్పు కలగాలి: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదేండ్ల అభివృద్ధి, రెండేండ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికే జూబ్లీహిల్స్​బై ఎలక్షన్ అని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​ అన్నారు. బుధవారం పార్టీ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్​వేసేందుకు బయల్దేరడానికి ముందు తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో సునీతకు కేసీఆర్​టికెట్​ఇచ్చారు. సునీత గెలుపుతో కాంగ్రెస్​ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలై పేదలకు న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్​గెలుపుతో కాంగ్రెస్‌‌‌‌కు కనువిప్పు కలగాలి” అని కేటీఆర్ అన్నారు.  

రాష్ట్ర బంద్‌‌‌‌కు మద్దతు.. 

తెలంగాణ ఉద్యమం లాగానే బీసీ రిజర్వేషన్లపైనా ఉద్యమిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. 18న తలపెట్టిన రాష్ట్రబంద్‌‌‌‌కు మద్దతివ్వాలని బీసీ జేఏసీ నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్​గౌడ్​తదితరులు బుధవారం తెలంగాణ భవన్‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసి కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్​మాట్లాడుతూ.. బీసీ సంఘాల బంద్‌‌‌‌కు మద్దతిస్తామని ప్రకటించారు.