తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటది..ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదు: కేటీఆర్

తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటది..ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదు: కేటీఆర్

 బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే  ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక  తెలంగాణ ప్రజల కష్టాలు పోతాయని చెప్పారు.  రాష్ట్రంలో ఎరువుల కోసం యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు.  నల్లబెల్లిలో మహిళా రైతుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు..  ప్రభుత్వం నడిపే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు కేటీఆర్.  

మీడియాతో మాట్లాడిన కేటీఆర్. . పాలిచ్చే బర్రెను పక్కనబెట్టి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు.  కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైంది..?  కరోనా సంక్షేభంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగలేదు.  కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా పథకాలు అమలు కావడం లేదు.  అటు ఇటు కానోడు పరిపాలిస్తే  ఇలాగే ఉంటది.  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే చూస్తున్నాం. మన ఖర్మకాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రభుత్వం ఎటుంటే పోలీసులు అటుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలి. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి అని అన్నారు. 

లిక్కర్ కేసులో కవితపై విచారణ ఆపేస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ చెప్పినట్లు ఏపీ ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.