బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ కు వీ6 ఫోబియా పట్టుకుంది. కర్నాటక వాల్మీకి స్కాం గురించి శనివారం అటు ట్విటర్లో, ఇటు మీడియాకు విడుదలచేసిన ప్రకటనలో ఆయన చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనం. వాల్మీకి వ్యవహారంలో ‘వీ6 బిజినెస్’ అనే సంస్థతో లావాదేవీలు జరిగాయని ఆరోపించిన కేటీఆర్.. ఆ సంస్థకు, వీ6 న్యూస్ చానెల్ కు సంబంధం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. తద్వారా వీ6 న్యూస్చానల్ను, దాని యజమాని వివేక్ వెంకటస్వామిని బద్నాం చేయాలని చూశారు.
నిజానికి వీ6 న్యూస్ చానెల్ కు సంబంధించి గానీ, వివేక్ సంస్థల్లో గానీ ‘వీ6 బిజినెస్’ పేరుతో సంస్థ లేనేలేదు. పదేండ్లు రాష్ట్ర మంత్రిగా అనుభవం ఉండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న కేటీఆర్ కనీసం వెరిఫై చేసుకోకుండానే ‘యథాలాపంగా’ నోరుజారారు. గతంలోనూ వీ6లో గుజరాత్ కల్తీ మద్యం మరణాల గురించి కథనాలు రాలేదని ఆరోపించిన కేటీఆర్.. గుజరాత్ ఘటనలపై ప్రసారమైన కథనాలను వీ6 బయటపెట్టగానే సైలెంటయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయన అవగాహన లేమిని బయటపెట్టుకున్నారు.