బ్రంచ్ ఈజ్ ద బెస్ట్

బ్రంచ్ ఈజ్ ద బెస్ట్
  • పెరుగుతున్న నయా కల్చర్
  • సెలబ్రిటీల నుంచి సామాన్యు ల వరకూ అట్రాక్ట్
  • వీకెండ్స్​లో సిటిజన్ల మక్కువ

హైదరాబాద్, వెలుగు: వీకెండ్ వచ్చిందంటే చాలామంది లంచ్, డిన్నర్ బయటకి వెళ్లి చేయడానికి ఇష్టపడుతుంటారు. వీకెండ్ లో వంటింటికి కాస్త గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో సహా రెస్టారెంట్ కి వెళ్లి నచ్చిన ఫుడ్ లాగించేస్తుంటారు. లంచ్ అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్యలో ఉంటుంది. డిన్నర్ నైట్ 7తరువాత మొదలవుతుంది. లంచ్, డిన్నర్ కి వెళ్లాలంటే ఇవే టైమింగ్స్. అయితే టిఫిన్ కి లంచ్ కి మధ్యలో ఇప్పుడు ఎక్కువగా బ్రంచ్ ని ఫాలో అవుతున్నారు సిటిజన్లు. సండే రోజు సాధారణంగానే లేట్ గా నిద్రలేస్తారు. ఆ టైంలో టిఫిన్ చేయలేరు అలా అని లంచ్ కూడా తినలేరు. అలాంటి వారు ఈ బ్రంచ్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సాటర్​డే నైట్ పార్టీస్ లో ఎంజాయ్ చేసేవారు, సండేస్ ఈ బ్రంచ్ తోనే రిఫ్రెష్ అవుతున్నారు. దీంతో ఈ బ్రంచ్ కల్చర్ సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు అందరిని అట్రాక్ట్ చేసేస్తోంది. ఇంతకీ ఈ కల్చర్ ఎక్కడ నుంచి వచ్చింది? బ్రంచ్ ఎలా ఉంటుంది? తెలుసుకుందాం.

విదేశాల్లో ఫేమస్

యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఇంగ్లాండ్, చైనా వంటి తదితర దేశాల్లో బ్రంచ్ ఫేమస్. అలా అక్కడి నుంచే నగరానికి విస్తరించింది. . ఈ బ్రంచ్ లో గుడ్లు, సాసేజ్‌లు, బేకన్, హామ్, పండ్లు, పేస్ట్రీలు, పాన్‌కేక్‌లు, వాఫ్ఫల్స్, స్కోన్లు, వంటి బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి.  ప్రపంచవ్యాప్తంగా చైనీస్ రెస్టారెంట్లలో డిమ్ సమ్ బ్రంచ్ ప్రసిద్ధి చెందింది. ఇది వివిధ రకాల స్టఫ్డ్ బన్స్, డంప్లింగ్స్,  స్వీట్ డిషెస్ తో ఉంటుంది. వీటితో పాటు ఆవిరితో, డీప్ ఫ్రై, కాల్చిన ఆహార పదార్థాలు ఉంటాయి.

సిటీలో సెటిల్..

నగరంలో పేరుగాంచిన రెస్టారెంట్లు, హోటల్స్ చాలానే ఉన్నాయి. ఈ రెస్టారెంట్స్ లో భారతీయ వంటకాలతో పాటు వెస్ట్రన్, చైనీస్, కాంటినెంటల్ ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉంటున్నాయి. బ్రేక్ ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో చేస్తారు కాబట్టి దీన్ని బ్రంచ్ గా పిలుస్తుంటారు. మామూలుగా సెలబ్రిటీలు వీకెండ్స్ లో ఫ్యామిలీతో రెస్టారెంట్ లకి వెళుతుంటారు. టిఫిన్, లంచ్ కాకుండా వారికి అనుగుణంగా ఉండే టైంలో ఇలా బ్రంచ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇలా ఫ్యామిలీస్ తో బ్రంచ్ కి వెళ్లే ఫొటోలను తమ సోషల్ మీడియా ద్వారా హ్యాష్ ట్యాగ్ బ్రంచ్ పేరుతో పోస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ ఫ్యామిలీతో కలిసి సండే రోజు బ్రంచ్ కి వెళుతుంటారు. ఈ ఫొటోలని అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేస్తుంటారు. ఇలా సెలబ్రిటీలతో పాటు కామన్ పీపుల్ కి కూడా ఈ కల్చర్ అలవాటైపోయింది. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్, ఇప్పుడు ఈ బ్రంచ్ ని ఫాలో అవుతున్నారు. దీంతో బ్రంచ్ ఫుల్ ఫేమస్ అయిపోయింది.