చెట్టును ఢీకొట్టిన బైక్‌‌‌‌.. జవాన్‌‌‌‌ మృతి

చెట్టును ఢీకొట్టిన బైక్‌‌‌‌.. జవాన్‌‌‌‌ మృతి
  • మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో ప్రమాదం

కొత్తగూడ, వెలుగు : బైక్‌‌‌‌ చెట్టును ఢీకొట్టడంతో బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ జవాన్‌‌‌‌ చనిపోయాడు. ఈ ప్రమాదం మహబూబాబాద్‌‌‌‌జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది. గంగారం మండలం అందుగుల గూడెంనకు చెందిన మద్దెల ప్రకాశ్‌‌‌‌  (25) బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ జవాన్‌‌‌‌గా జమ్మూకశ్మీర్‌‌‌‌లో పనిచేస్తున్నాడు. సెలవుపై ఐదు రోజుల కింద ఇంటికి వచ్చాడు. ఆదివారం కొత్తగూడ మండలం గోవిందాపురంలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌‌‌‌కు వెళ్లిన ప్రకాశ్ రాత్రి 8 గంటలకు బైక్‌‌‌‌పై  తిరిగి వస్తున్నాడు.

 పెగడపల్లి నర్సరీ మూలమలుపు వద్దకు రాగానే బైక్‌‌‌‌ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రకాశ్‌‌‌‌ను స్థానికులు వరంగల్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు. ఈ మేరకు కొత్తగూడ ఎస్సై కుశకుమార్‌‌‌‌ కేసు నమోదు చేశారు. సోమవారం అధికారిక లాంఛనాలతో స్వగ్రామంలో ప్రకాశ్‌‌‌‌ అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి గంగారం ఎస్సై రవికుమార్, కొత్తగూడ ఎస్సై కుశకుమార్, ఆర్‌‌‌‌ఎస్సై శేఖర్‌‌‌‌ నివాళులర్పించారు.