UP Polls: రెండో ద‌శ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టించిన బీఎస్పీ

UP Polls: రెండో ద‌శ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టించిన బీఎస్పీ

యూపీలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. వ‌చ్చేనెల‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ప్ర‌ముఖ‌  పార్టీలు వ‌రుస‌గా త‌మ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టిస్తున్నాయి. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి యూపీ రెండో ద‌శ ఎన్నిక‌ల కోసం బీఎస్పీ పార్టీకి చెందిన అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేశారు. రెండో ద‌శ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న 55 స్థానాల‌కు గాను.. 51 మంది అభ్య‌ర్థుల పేర్ల‌ను ఆమె ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ ఆమె ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం ప్ర‌తీ ఒక్క కార్య‌క‌ర్త క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని పిలుపు నిచ్చారు.2007లో గెలిచిన విధంగా మ‌రోసాని బీఎస్పీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌ని ఆశిస్తున్నామ‌న్నారు.  హ‌ర్ పోలింగ్ బూత్ కో జితానా హై.. బీఎస్పీకో స‌త్తామే లానా హై అనే నినాదం  కూడా ఇచ్చారు మాయావ‌తి. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీలో  మొత్తం 403 సీట్లు ఉన్నాయి. దేశంలోనే అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నయూపీలో ఫిబ్ర‌వ‌రి 10వ (february) తేదీ నుంచి ఎన్నిక‌లు జ‌రగుతాయి. మొత్తం ఏడుద‌శల్లో ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. మొద‌టి ద‌శ ఫిబ్ర‌వ‌రి- 10, రెండో ద‌శ ఫిబ్ర‌వ‌రి - 14, మూడో ద‌శ ఫిబ్ర‌వ‌రి - 20, నాలుగో ద‌శ  ఫిబ్ర‌వ‌రి -23, ఐదో ద‌శ -27, ఆరో ద‌శ మ‌ర్చి -3, ఏడో ద‌శ మార్చి -7వ తేదీన జ‌ర‌గనున్నాయి. మార్చి 10వ తేదీన ఎన్నిక‌ల కౌంటింగ్ నిర్వ‌హిస్తారు. ఫ‌లితాలు అదే రోజు ప్ర‌క‌టిస్తారు. 

ఇవి కూడా చ‌ద‌వండి: 

బీజేపీ తప్ప.. ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ 

ముంబైలో అగ్నిప్రమాదం: ఏడుగురి మృతి