
- పవర్లోకి రాగానే మీ ఆస్తులన్నీ ప్రజలకు పంచుతాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- రహస్యంగా భూ దోపిడీ చేస్తారా
- కోకాపేటలో రూ.550 కోట్ల భూమి రూ.37 కోట్లకే కొట్టేస్తారా
- అధిక ధరలకు వేలాలు వేస్తున్న మీకు తక్కువ రేటెందుకు
- బీఆర్ఎస్ పై బీఎస్పీ స్టేట్ చీఫ్ ప్రవీణ్ కుమార్ ఫైర్
కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి 550 కోట్ల రూపాయల విలువైన 11 ఎకరాల భూమిని కేవలం రూ.37 కోట్లకే నిర్లజ్జగా, విచ్చ లవిడిగా దోపిడీ విధానంలో అత్యంత రహస్యంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని బీఎస్పీ ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఒక ట్వీట్ చేశారు.
ఒకవైపు హెచ్ఎండీఏ పరిధిలో వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను గుంజుకొని బహిరంగ వేలం వేస్తూ,వేల కోట్లు సంపాదిస్తున్న ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలకు మాత్రం మార్కెట్ రేటు కన్నా 10 రెట్లు తక్కువగా భూమిని కొనడం విడ్డూరంగా ఉందన్నారు.
పార్టీ ఫండ్ తో విందు, వినోదాల కోసం విమానాలు కొను క్కున్న మీరు అదే పార్టీ ఫండ్ తో బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం భూములు కొను క్కోవాలని, ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పె ట్టకండని సూచించారు. రాబోయే బహుజన రాజ్యంలో మీరు దోపిడీ, దౌర్జన్యంతో ఆక్ర మించిన, సంపాదించిన ఆస్తులను తిరిగి ప్రజలకు పంచుతామని స్పష్టం చేశారు.