అగ్నిపథ్ లోపభూయిష్టమైన స్కీం

అగ్నిపథ్ లోపభూయిష్టమైన స్కీం

హైదరాబాద్: అగ్నిపథ్ లోపభూయిష్టమైన స్కీం అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో నిర్వహించిన ఆందోళనలో గాయపడ్డ యువకులను పరామర్శించడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. అయితే  ఆసుపత్రి లోపలకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోగా... ఆయన అక్కడినుంచి  వెనుదిరిగారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ... శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు దాడులు చేయడం వల్లే విధ్వంసం చోటు చేసుకుందని తెలిపారు. సివిల్ సమాజాన్ని మిలిటరైజ్ చేసి... దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు రూపొందించిందే అగ్నిపథ్ అని తీవ్రంగా ఆరోపించారు. ఈ స్కీం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగంలేదని, వారి జీవితాలతో ఆడుకునేందుకే కేంద్ర ప్రభుత్వం స్కీంను తెచ్చిందన్నారు. ఆర్మీ అనేది కాంట్రాక్ట్ ఉద్యోగం కాదని, ఉద్యోగ భద్రత ఉంటేనే సైనికులు పోరాడగలుతారని చెప్పారు. స్కీమ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసి... ఎప్పటిలాగే రెగులర్ రిక్రూట్మెంట్ ద్వారా ఆర్మీ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.