శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు చాలామంది భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలో శ్రీశైలం ఆలయంతోపాటు శ్రీశైలం పరిసర ప్రాంతాలను కాలుష్య రహితంగా చేయాలని భావించిన శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వెల్లడించారు.
ALSO READ : శ్రీకాళహస్తి దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు..
శ్రీశైలం దేవస్థానం ఆవరణలో ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. ప్లాస్టిక్ బాటిల్ స్థానం లో బయోడిగ్రేడబుల్ వాటర్ బాటిల్ ప్రవేశ పెడుతున్నామని ఆలయ అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ లో భాగంగా శివరాత్రి కి శ్రీశైల క్షేత్రం లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి అటవీ అధికారులు కూడా అనుమతిచ్చారు. త్వరలో అన్ని దేవాలయాల్లో బయోడిగ్రేడబుల్ వాటర్ బాటిల్స్ ను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్వచ్ఛాoధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్ తెలిపారు.
