జేఎన్టీయూ క్యాంపస్ స్టూడెంట్ సూసైడ్

జేఎన్టీయూ క్యాంపస్ స్టూడెంట్ సూసైడ్

పుల్కల్, వెలుగు: బీటెక్ స్టూడెం ట్ సూసైడ్ చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఎస్ఐ విశ్వజన్ కథనం ప్రకా రం.. సూర్యాపేట జిల్లాకు చెంది న బానోత్ మహేందర్(20) సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ జేఎన్టీయూ క్యాంపస్ లో బీటెక్ (సీఎస్సీ) థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కాలేజ్ నుంచి  హాస్టల్ కు వెళ్లాడు.

 ఆ తర్వాత క్లాస్ కు వెళ్లలేదు. ఫ్రెండ్స్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోగా హాస్టల్ రూమ్ కు వచ్చి డోర్ కొట్టిన తీయలేదు. దీంతో కిటికీ లోంచి చూడగా ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించాడు. తలుపు పగులగొట్టి వెళ్లి, కిందకు దించి అంబులెన్‌ లో  సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. డీఎస్పీ సత్తయ్య, జోగిపేట సీఐ అనిల్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.