సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలోని ఇందిరానగర్ హైస్కూల్‌లో అడ్మిషన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో పదేళ్లుగా అడ్మిషన్లకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 6వ, 8వ తరగతుల్లో 210 మంది సీట్లకు 700 మంది విద్యార్థులు అప్లైచేసుకోగా వారికి ఇటీవల ఎంట్రెన్స్ టెస్ట్ రాశారు. రెండు రోజుల్లో రిజల్ట్స్ విడుదల చేసి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని హెచ్‌ఎం ఎ.రాజప్రభాకర్ రెడ్డి తెలిపారు.
