ఓట్ చోరీ.. సీట్ చోరీ కాంగ్రెస్‌‌కే చెల్లుతుంది..రాబోయే పదేళ్లు ఎన్డీఏదే అధికారం

ఓట్  చోరీ.. సీట్ చోరీ కాంగ్రెస్‌‌కే చెల్లుతుంది..రాబోయే పదేళ్లు ఎన్డీఏదే అధికారం

మెదక్​ టౌన్, వెలుగు: ఓట్​ చోరీ.. సీట్​ చోరీ కాంగ్రెస్​కే చెల్లుతుందని మెదక్  ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఓటరు జాబితా సవరణ విషయంలో సీఎం రేవంత్​ రెడ్డి గుంపు మేస్త్రీలాగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. ఆదివారం మెదక్​లో బీజేపీ జిల్లా ఆఫీస్​లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్​ కుమార్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. 

70 ఏళ్లలో కాంగ్రెస్​ చేయని అభివృద్ధిని కేవలం 12 ఏండ్లలో చేయడంతో కాంగ్రెస్​ ఓర్వలేకపోతోందని విమర్శించారు. మోదీ, బీజేపీ పాలనలో ప్రజలు ఎంతో ఆనందంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారని తెలిపారు. దేశ ప్రజలంతా కాంగ్రెస్​ ముక్త్​ భారత్​ను కోరుకుంటున్నారని, రాబోయే పదేళ్లు ఎన్డీఏ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

మోదీని రాజీనామా చేయాలని అంటున్న సీఎం రేవంత్​ రెడ్డికి చేతనైతే ముందుగా అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్​​చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు​మల్లేశ్​గౌడ్, గడ్డం శ్రీనివాస్, ఈర్ల రంజిత్​ రెడ్డి, సురేశ్  పాల్గొన్నారు.