బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..బాలిక మృతి, ఇద్దరికి గాయాలు..సంగారెడ్డి జిల్లాలో ఘటన

బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..బాలిక మృతి, ఇద్దరికి గాయాలు..సంగారెడ్డి జిల్లాలో ఘటన

పుల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా చౌటకూర్  మండలం హోన్నాపూర్  గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్సై విశ్వజన్  తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట మండలంలోని పెద్దాపూర్  గ్రామానికి చెందిన బూర్ర వైష్ణవి(13) రెండు రోజుల కింద పుల్కల్  మండలం మిన్పూర్  గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. 

ఆదివారం వైష్ణవిని పెద్దాపూర్​ గ్రామానికి ఆమె మేనమామ కాసాల భాస్కర్, కూతురు రమ్యశ్రీతో కలిసి బైక్ పై తీసుకెళ్తున్నాడు. హోన్నాపూర్  శివారులో జోగిపేట వైపు నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్​ను వెనుక నుంచి ఢీకొట్టగా, ముగ్గురు కింద పడిపోయారు. వైష్ణవి తలపై నుంచి బస్​ టైర్  పోవడంతో అక్కడిక్కడే చనిపోయింది. బాస్కర్, రమ్యశ్రీకి స్వల్ప గాయాలయ్యాయి. భాస్కర్  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.