తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పృథ్వీ షా సెంచరీ

తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే  పృథ్వీ షా సెంచరీ

చెన్నై: నేషనల్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ కోల్పోయి ముంబై నుంచి మహారాష్ట్ర జట్టుకు మారిన తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే యంగ్ బ్యాటర్ పృథ్వీ షా (141 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 111) సెంచరీతో మెప్పించాడు. బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మహారాష్ట్రను పృథ్వీ సెంచరీతో ఆదుకున్నాడు. దాంతో రెండో రోజు మంగళవారం తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహారాష్ట్ర 73 ఓవర్లలో 217 రన్స్ కు ఆలౌటైంది. ఓ దశలో 86/4తో నిలిచిన జట్టును సౌరభ్ నవాలె (50)తో కలిసి షా ముందుకు తీసుకెళ్లాడు. అనంతరం 35 రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆట చివరకు 43/2 స్కోరుతో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 252 స్కోరు వద్ద ఆలౌటైన ఆ జట్టు ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 78 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంలో ఉంది. 

హైదరాబాద్ 267/6

పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  హైదరాబాద్ ప్రత్యర్థికి బలమైన పోటీ ఇస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంజాబ్ 90 ఓవర్లలో  348/5 స్కోరు చేసింది. ఉదయ్ ప్రతాప్ సింగ్ (113 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), రమణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్ (111) సెంచరీలు కొట్టగా.. టి. రవితేజ, అనికేత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన హైదరాబాద్ రెండో రోజు ఆట చివరకు 71 ఓవర్లలో 267/6 స్కోరుతో నిలిచింది. అభిరత్ రెడ్డి (74 రిటైర్డ్ హర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సత్తా చాటాడు.  తన్మయ్ అగర్వాల్ (39), హిమతేజ (36),  రాహుల్ సింగ్ (33) కూడా రాణించగా.. ఎ. వరుణ్ గౌడ్ (31బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. పంజాబ్ స్కోరుకు హైదరాబాద్ ఇంకా 81 రన్స్ దూరంలో ఉంది.