అనారోగ్యంతో ఏప్రిల్ 9 శుక్రవారం చనిపోయిన బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలను ఈ నెల 17న నిర్వహించనున్నట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి బయటివారిని అనుమతించడం లేదని తెలిపింది. ప్రిన్స్ కుటుంబీకులు 30 మంది మాత్రమే అంతిమ సంస్కారాలకు హాజరుకానున్నట్లు స్పష్టం చేసింది. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 3 గంటలకు నేషనల్ మినట్స్ సైలెన్స్ పాటించిన తర్వాత ఫిలిప్ అంత్యక్రియలు ప్రారంభమవుతాయని బకింగ్ హామ్ ప్యాలెస్ తెలిపింది.
