విశ్వశాంతి, సామరస్యం కోసం బుద్ధదమ్మ యాత్ర : మల్లేపల్లి లక్ష్మయ్య

విశ్వశాంతి, సామరస్యం కోసం బుద్ధదమ్మ యాత్ర : మల్లేపల్లి లక్ష్మయ్య
  • బుద్ధవనం స్పెషల్ ​ఆఫీసర్​ మల్లేపల్లి లక్ష్మయ్య వెల్లడి 

హైదరాబద్​ సిటీ, వెలుగు : కర్నాటకలోని గుల్బర్గా బుద్ధ విహార్ నుంచి మొదలైన బుద్ధదమ్మ యాత్ర మార్చి 1కి  తెలంగాణలోని నాగార్జునసాగర్ బుద్ధవనానికి చేరుకుంటుందని గగన్​మాలిక్​ ఫౌండేషన్​ చైర్మన్​ గగన్, బుద్ధవనం స్పెషల్​ఆఫీసర్​ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. మార్చి 1 నుంచి 3 వరకు బుద్ధవనంలో వివిధ కార్యక్రమాలుం టాయని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో వారు మీడియాతో మాట్లాడారు.

విశ్వశాంతి, సామరస్యం కోసమే ఈ యాత్రను  చేపట్టామని పేర్కొన్నారు.గుల్బర్గాలోని బుద్ధ విహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 3వ దమ్మ యాత్ర ప్రారంభమైందని, హైదరాబాద్​లో మినిస్టర్లు మల్లు భట్టి విక్రమార్క, వివేక్​ వెంకటస్వామి స్వాగతం పలికారన్నారు.