
మహారాష్టలోని వాషిమ్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ గేదె రెండు లక్షల రూపాయల విలువైన బంగారు మంగళసూత్రాన్ని తీనేసింది. అయితే గేదెకు 2 గంటల సుదీర్ఘ శస్త్రచికిత్స చేసిన అనంతరం ఆ మంగళసూత్రం బయటకు వచ్చింది. వాషిమ్‌లోని సర్సీ గ్రామానికి చెందిన ఒక మహిళ గత వారం (సెప్టెంబర్ 27) బుధవారం నిద్రపోయే ముందు రాత్రి తన మంగళసూత్రాన్ని ప్లేట్‌లో ఉంచింది. మరుసటి రోజు అదే ప్లేటులో సోయాబీన్ పొట్టుతో గేదెకు తినిపించింది.
#WATCH महाराष्ट्र:वाशिम ज़िले के एक गांव में भैंस के द्वारा सोने का मंगलसूत्र खाने की घटना सामने आई है। ऑपरेशन से 25 ग्राम का मंगलसूत्र निकाला गया।
— ANI_HindiNews (@AHindinews) October 1, 2023
पशु चिकित्सा अधिकारी बालासाहेब कौंदाने ने बताया, " मेटल डिटेक्टर से पता चला कि भैंस के पेट में कोई धातु है। 2 घंटे ऑपरेशन चला,… pic.twitter.com/AlM8cpamMc
Also Read :- సీఎం స్టాలిన్ కుమార్తె గుడిలో పూజలు
గేదె మేతతో పాటు మంగళసూత్రాన్ని కూడా తిన్నది. కాసేపటికి తన మంగళసూత్రం కనిపించకపోవడంతో గందరగోళానికి గురైంది. ఎక్కడా చూసిన కనిపించకపోవడంతో ఆలోచించడం మొదలు పెట్టింది. కొంతసేపటికి తన మంగళసూత్రాన్ని గేదెకు సోయాబీన్ పొట్టు ఇచ్చిన ప్లేటులో మంగళసూత్రాన్ని పెట్టి్న్నట్లుగా ఆమెకు గుర్తొచ్చింది. గేదె సోయాబీన్ పొట్టుతో పాటుగా మంగళసూత్రాన్ని కూడా తినేసిందని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే గేదెల బాగోగులు చూసి పశువైద్యులను సంప్రదించారు. మెటల్ డిటెక్టర్‌ను ఉపయోగించి ఆమె కడుపులో బంగారం ఉన్నట్లు నిర్ధారించారు. గేదెకు శ్రస్త చికిత్స చేసి మంగళసూత్రాన్ని బయటకు తీశారు.