హర్యానా లోకేషన్..అల్ఫలాహ్ యూనివర్సిటీ.. బాయిస్ హాస్టల్ బిల్డింగ్ నం.17, రూం నం.13. ఓ సాధారణ మురికి, నీళ్లు పారుతున్న గది..మెడికల్ స్టూడెంట్ హాస్టల్.. వైట్ కాలర్ టెర్రరిస్టుల అడ్డా.. టెర్రర్ మాడ్యుల్ సీక్రెట్ మీటింగ్ పాయింట్.. ఢిల్లీ ఎర్రకోట బాంబు బ్లాస్ట్ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి..
సోమవారం ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడు.. 13 మంది ప్రాణాలు బలిగొన్న ఘటన తర్వాత అల్ అలాఫ్యూనివర్సిటీ వార్తల్లోకి వచ్చింది. సూసైడ్ బాంబర్ గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ నబీ ఈ యూనివర్సిటీ, ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు తెలిశాక.. దర్యాప్తు చేపట్టిన అధికారులకు ఈ యూనివర్సిటీ ఉగ్రవాదుల అడ్డాగా పనిచేసిందని తెలిసింది.
ఢిల్లీ పేలుడు ఘటనకు ఒక రోజు ముందు.. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేసిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్దగ్గర 2900 కిలో గ్రాముల IED తయారీ సామాగ్రి లభించింది. మరోవైపు డాక్టర్ షాహీన్ షాహిద్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జైషే ఏ మొహమ్మద్ మహిళా విభాగం రిక్రూటర్ గా పనిచేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్న షాహీన్ కూడా అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉద్యోగిగా పనిచేశారు.
దేశంలో ఉగ్ర కుట్ర భగ్నం చేసిన పోలీసులు.. ముజమ్మిల్, షాహీన్ లను అరెస్ట్ చేశారు. సూసైడ్ బాంబర్ గా అనుమానిస్తున్న ఉమర్ పేలుళ్లలో చనిపోయారు. ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాశ్మీర్ కు చెందిన మరో డాక్టర్ నిసార్ ఉల్ హసన్ ను కనిపించకుండా పోయాడు.
అంతా రూం నంబర్ 13లోనే..
కాశ్మీర్ లోని పుల్వామాకు చెందిన డాక్ట్ ముజమ్మిల్ హాస్టల్ లోని ఈ 13 నంబర్ గదిలో ఉంటున్నాడు. ఈ గదిలోనే వైట్ కాలర్ ఉగ్రవాద డాక్టర్లతో పేలుళ్ల కుట్రలు చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.ఢిల్లీ, దాని సమీప రాష్ట్రాలలో ఒకేసారి పేలుళ్లు జరపాలని ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత రోజున పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు అరెస్టయిన నిందితుల విచారణలో తేలింది.
యూనివర్సిటీ ల్యాబ్నుంచి హాస్టల్గదికి కెమికల్స్ ఎలా తరలించాలి.. తయారీకి సంబంధించిన విషయాలపై ఈ రూం నంబరు 13లో స్కెచ్ గీసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సోదాల్లో ఈ రూం నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, పెన్ డ్రైవ్ లను స్వాధీనం చేసుకున్నారు. గది ని సీజ్ చేశారు.
రూం నం 13లో లభించిన కెమికల్స్ శాంపిల్స్ ఆధారంగా అమ్మోనియం నేట్రేట్, మెటాలిక్ ఆక్సైడ్లతో కలిపి పేలుడు పదార్థాలను తయారుచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఎర్రకోట పేలుడులో అమ్మోనియం నేట్రేట్ ఆయిల్ వినియోగించినట్లు నిర్ధారణ కావడంతో ఉగ్ర కుట్ర ఇక్కడినుంచే జరిగిందన్న అనుమానాలు బలపడ్డాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
అయితే టెర్రర్ మాడ్యుల్ అరెస్ట్ పై రెండు రోజుల తర్వాత మౌనం వీడింది అల్ ఫలాహ్ యూనివర్సిటీ సంస్థ అధికారులు. సంస్థాగత సహకారం ఉందన్న ఆరోపణలను తోసిపుచ్చింది. యూనివర్సిటీలో ఎటువంటి అనధికార కెమికల్స్ ఎప్పుడు ఉపయోగించలేదని నిల్వ చేయలేదని తెలిపింది.
