మహారాష్ట్రలో కుప్పకూలిన బిల్డింగ్.. మరో 3 డెడ్ బాడీలు వెలికితీత

 మహారాష్ట్రలో కుప్పకూలిన బిల్డింగ్..  మరో 3 డెడ్ బాడీలు వెలికితీత
  • మరో 3 డెడ్ బాడీలు వెలికితీత
  • మహారాష్ట్రలో కుప్పకూలిన బిల్డింగ్
  • ఆరుకు పెరిగిన మృతుల సంఖ్య
  • కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

థానె: మహారాష్ట్ర థానే జిల్లా భివండిలో కూలిన రెండంతస్తుల భవనం శిథిలాల నుంచి మరో 3 డెడ్​బాడీలను వెలికితీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరిందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం శిథిలాల కింది నుంచి సునీల్ పిసా(38) అనే వ్యక్తిని రెస్క్యూ చేసి ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. ఇంకో 15 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని థానె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. నేషనల్.. స్టేట్ డిజాస్టర్  రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో రెస్క్యూ కొనసాగుతోందన్నారు. వల్పాడ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం రెండంతుస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. మొదటి అంతస్తులోని గోడౌన్లలో పనిచేస్తున్న కార్మికులతో సహా.. పై అంతస్తులో ఉంటున్న 4 కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఆరుగురు చనిపోగా మరో 12 మందికి గాయాలయ్యాయి. 

దురదృష్టకరం: సీఎం షిండే

ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ షిండే విచారం వ్యక్తం చేశారు. బిల్డింగ్ కూలిన ప్రాంతాన్ని ఆయన శనివారం పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, గాయపడినవాళ్ల ఆస్పత్రి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ప్రకటించారు. బిల్డింగ్ ఓనర్ ఇంద్రపాల్ పాటిల్​పై కేసు పెట్టినట్లు భివండి పోలీసులు తెలిపారు.