బిల్డింగ్ పై నుంచి పడి కూలీ మృతి..ఉప్పల్ భగాయత్ నగర్ లో ఘటన

బిల్డింగ్ పై నుంచి పడి కూలీ మృతి..ఉప్పల్ భగాయత్  నగర్ లో ఘటన

ఉప్పల్​, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి పడి కూలీ మృతిచెందాడు. ఉప్పల్​ భగాయత్​లోని ప్లాట్​ నంబర్​ 744లో నిర్మాణంలో ఉన్న భవనంలో సెంట్రింగ్​ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర గోండియా ప్రాంతానికి చెందిన ద్వారకా ప్రసాద్(41) అనే కూలీ ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలై స్పాట్​లో చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో భవన యాజమాని హర్షసాయి, మేస్ర్తీ తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు ఉప్పల్​ పోలీసులు తెలిపారు.