హయత్ నగర్ లో కొట్టుకుపోయిన ఇంటి పునాది.. పక్కకు ఒరిగిన బిల్డింగ్.. ఎప్పుడైనా కూలిపోయే ఛాన్స్..

హయత్ నగర్ లో కొట్టుకుపోయిన ఇంటి పునాది.. పక్కకు ఒరిగిన బిల్డింగ్.. ఎప్పుడైనా కూలిపోయే ఛాన్స్..

హైదరాబాద్ లో గురువారం ( సెప్టెంబర్ 11 ) ఎడతెరపి లేకుండా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. సిటీలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా సిటీ శివారు ప్రాంతాలు వనస్థలిపురం నుంచి హయత్ నగర్ వరకు భారీ వర్షం దంచికొట్టింది. గురువారం మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. చాలా కాలనీలు జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా... హయత్ నగర్ లోని ఓ ఇంటి పునాది కొట్టుకుపోవడంతో బిల్డింగ్ ఒక పక్కకు ఒరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

హయత్ నగర్ లోని పద్మ కాలనీలోని ఓ బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఇంటి పునాది కొట్టుకుపోవడంతో బిల్డింగ్ పక్కకు ఒరిగింది. ఏ క్షణాన కూలుతుందో అని భయపడుతున్నారు స్థానికులు. భవనం మెల్లగా పక్కకు ఒరుగుతున్న క్రమంలో భయబ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. 

ఇంటిని ఆనుకొని హైటెన్షన్ 11 కేవీ విద్యుత్ తీగలు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరుగుతుందేమోనని అంతా టెన్షన్ పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆస్థి ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలని కోరుతున్నారు స్థానికులు.