మార్కెట్‌లో మళ్లీ బుల్‌ రన్‌!

మార్కెట్‌లో మళ్లీ బుల్‌ రన్‌!

ఇన్వెస్టర్ల సంపద రూ. 7.21 లక్షల కోట్లు పైకి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌పై రష్యా దాడిని ఆపేందుకు దౌత్యపరంగా చర్యలు స్టార్టయ్యాయనే రిపోర్ట్స్‌‌‌‌ రావడంతో స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. రిలయన్స్‌‌‌‌, ఐటీ షేర్లు పెరగడంతో బెంచ్‌‌‌‌మార్క్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లు 2 శాతం మేర పెరిగాయి. సెన్సెక్స్‌‌‌‌ బుధవారం 1,223 పాయింట్లు (2.29 శాతం) పెరిగి 54,647 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 332 పాయింట్లు (2.07 శాతం) లాభపడి 16,345 వద్ద ముగిసింది.  నిఫ్టీలోని 50  షేర్లలో 40 లాభాల్లో క్లోజయ్యాయి. గత రెండు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ. 7.21 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం సెన్సెక్స్‌‌‌‌లో ఏషియన్ పెయింట్స్‌‌‌‌, రిలయన్స్‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌, బజాజ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌, ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్‌‌‌‌, బజాజ్‌‌‌‌ ఫిన్సర్వ్‌‌‌‌, మారుతి సుజుకీ, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. పవర్ గ్రిడ్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌, ఎన్‌‌‌‌టీపీసీ, టాటా స్టీల్, విప్రో షేర్లు నష్టాల్లో ముగిశాయి. నాటో మెంబర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ కోసం ప్రయత్నించమని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్రకటించడంతో దలాల్‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌లో బుల్స్ ఆధిపత్యం కొనసాగిందని  ఎల్‌‌‌‌కేపీ సెక్యూరిటీస్‌‌‌‌ ఎనలిస్ట్ రంగనాథన్ పేర్కొన్నారు. రష్యా–ఉక్రెయిన్‌‌‌‌కు చెందిన టాప్ అధికారులు గురువారం టర్కీలో సమావేశం కానున్నారు.  ‘కిందటి సెషన్‌‌‌‌ లాభాలను డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌ కొనసాగించింది.  యురోపియన్ మార్కెట్స్, యూఎస్ ఫ్యూచర్స్‌‌‌‌ లాభపడ్డాయి. అసెంబ్లీ ఎలక్షన్స్‌‌‌‌ ఎగ్జిట్ పోల్స్‌‌‌‌పై మార్కెట్‌‌‌‌లు పాజిటివ్‌‌‌‌గా స్పందించాయి. ఎన్నికల రిజల్ట్స్‌‌‌‌, గ్లోబల్‌‌‌‌ ట్రెండ్ బట్టి మార్కెట్‌‌‌‌లు పెరగడం లేదా పడతాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌ వినోద్ నాయర్ పేర్కొన్నారు. మార్చి 27 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌‌‌‌ తిరిగి స్టార్ట్ కానుండడంతో ఏవియేషన్ షేర్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. ఇండిగో, స్పైస్‌‌‌‌జెట్‌‌‌‌ షేర్లు 7 శాతం వరకు పెరిగాయి. బీఎస్‌‌‌‌ఈ మిడ్‌‌‌‌క్యాప్, స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌లు 2.37 శాతం వరకు లాభపడ్డాయి. హాంకాంగ్‌‌‌‌, షాంఘై, టోక్యో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 44 పైసలు పెరిగి 76.56 వద్ద సెటిలయ్యింది.