టెన్త్, ఐటీఐ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్లకు బంపర్ ఆఫర్.. BSF లో 3,588 జాబ్స్..

టెన్త్, ఐటీఐ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్లకు బంపర్ ఆఫర్.. BSF లో  3,588 జాబ్స్..

భారత హోంమంత్రిత్వశాఖ పరిధిలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్(బీఎస్ఎఫ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్స్​మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ : ఆగస్టు 24. 

పోస్టుల సంఖ్య: 3588 కానిస్టేబుల్(ట్రేడ్స్​మెన్), పురుషులు 3406, కానిస్టేబుల్ (ట్రేడ్స్​మెన్ ) మహిళలు 182.
 

ఎలిజిబిలిటీ

కానిస్టేబుల్(కార్పెంటర్), కానిస్టేబుల్(ప్లంబర్), కానిస్టేబుల్(పెయింటర్), కానిస్టేబుల్(ఎలక్ట్రీషియన్), కానిస్టేబుల్(పంప్ ఆపరేటర్) పోస్టులకు పదో తరగతి లేదా సమాన అర్హతతోపాటు రెండేండ్ల ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

కానిస్టేబుల్(కోబ్లర్), కానిస్టేబుల్(టైలర్), కానిస్టేబుల్(వాషర్​మెన్), కానిస్టేబుల్(బార్బర్), కానిస్టేబుల్
(స్వీపర్), కానిస్టేబుల్(ఖోజీ/ సైస్) పోస్టులకు పదో తరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 18 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 25 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: జులై 22.

లాస్ట్ డేట్: ఆగస్టు 24.  

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 

సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్​టీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్(క్వాలిఫయింగ్), రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు bsf.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

రాత పరీక్ష ప్యాటర్న్

కానిస్టేబుల్(ట్రేడ్స్​మెన్) రాత పరీక్షలో మొత్తం నాలుగు సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్​నెస్, ఎలిమెంట్రీ మ్యాథమెటిక్స్, అనలైటికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్/ హిందీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. జనరల్ అవేర్​నెస్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, ఎలిమెంట్రీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, అనలైటికల్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, ఇంగ్లిష్/ హిందీ 25 ప్రశ్నలు 25 మార్కులకు మొత్తం 100 ప్రశ్నలు100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. రెండు గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. 

స్పోర్ట్స్ కోటాలో

బీఎస్ఎఫ్ స్పోర్ట్స్ కోటాలో గ్రూప్–సి క్యాటగిరీలో కానిస్టేబుల్(జనరల్) డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 20. 

పోస్టుల సంఖ్య: 241 కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పురుషులు 113, కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) మహిళలు 128.

ఎలిజిబిలిటీ: పదోతరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. స్పోర్ట్స్​లో అంతర్జాతీయ, జాతీయ సత్తా చాటి ఉండాలి.

వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 18 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 23 ఏండ్లు. 

ఫిజికల్ స్టాండర్డ్స్: పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ., మహిళా అభ్యర్థులు 157 సెం.మీ.లు ఉండాలి. లాస్ట్ డేట్: ఆగస్టు 20.  

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.147.20. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 

సెలెక్షన్ ప్రాసెస్: అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గెలిచిన మెడల్స్ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.  ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్​టీ), మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు bsf.gov.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు. 

►ALSO READ | తెలంగాణలో ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాలు.. లోకల్లో ఉంటూ జాబ్ చేసుకోవచ్చు.. మంచి ఛాన్స్ !