
ఐసీసీ అవార్డుల్లో భారత్ సత్తా చాటింది. మెన్స్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహిళల విభాగంలో స్మృతి మంధాన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు. రెండు విభాగాల్లో ఈ ఐసీసీ అవార్డు మన భాతీయులకే దక్కడం విశేషం. గ్లోబల్ ఓటింగ్ ద్వారా నిర్వహించబడిన ఈ వోటింగ్ లో బుమ్రా,మంధాన అత్యధిక మెజారిటీతో ఈ అవార్డులను గెలుచుకున్నారు.
అమెరికా, వెస్టిండీస్‌లో ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా టాప్ బౌలింగ్ తో అదరగొట్టాడు. ఈ టోర్నీలో కేవలం 4.17 ఎకానమితో బుమ్రా 15 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ యావరేజ్ 8 మాత్రమే. భారత్ వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. తాజాగా జూన్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ విషయంపై బుమ్రా స్పందిస్తూ.. ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైనందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ అవార్డు నాకు ఎంతో ప్రత్యేకం. వరల్డ్ కప్ నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించింది". అని ఈ టీమిండియా పేసర్ అన్నాడు.
ALSO READ | T20 World Cup 2024: మా ఆటగాళ్లు మంచోళ్లు.. మందు తాగలే: శ్రీలంక క్రికెట్ బోర్డు
మహిళల విభాగానికి వస్తే విభాగంలో స్మృతి మంధాన అసాధారణ ఫామ్ ను కనబరిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో రెండు సెంచరీలు.. ఒక హాఫ్ సెంచరీ చేసింది. ఏకైక టెస్టులోనూ 149 పరుగులు చేసింది. "జూన్ నెలలో ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ను గెలుచుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. జట్టు పనితీరు పట్ల నేను నిజంగా సంతోషంగా ఉన్నాను". అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.
Jasprit Bumrah and Smriti Mandhana were recognized with the ??? ?????? ?? ??? ????? award (JUNE) for their exceptional performances. pic.twitter.com/dedtFStiDq
— CricTracker (@Cricketracker) July 9, 2024