యాదగిరిగుట్టలో సామాన్య భక్తులకు చుక్కలే

యాదగిరిగుట్టలో సామాన్య భక్తులకు చుక్కలే
  • ఆపై ప్రతి గంటకూ రూ. 100.. యాదాద్రిలో భక్తులకు చుక్కలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలంటే ఇక సామాన్య భక్తులకు చుక్కలే. భక్తులు తాము వచ్చిన కారుతో కొండపైకి వెళ్లాలంటే రూ.500 కట్టాల్సిందే. కొండపైన గంటకు పైగా వాహనం నిలిపితే మరో రూ.100 చెల్లించాల్సిందే. ఎన్ని గంటలు కొండపైన ఉంటే ఆ మేరకు ఒక్కో గంటకు రూ.100 చొప్పున అదనంగా కట్టాల్సిందే. దీనికి సంబంధించిన కొత్త రూల్స్ ను ఆలయ ఈవో గీతారెడ్డి శనివారం విడుదల చేశారు. కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వులు మే 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
కొత్త రూల్స్ ప్రకారం.. సొంత వాహనంలో యాదగిరిగుట్టకు వచ్చిన భక్తులు.. కొండపైకి వెళ్లడానికి ఒక్కో వాహనానికి రూ.500 కట్టాలని, కొండపైకి చేరుకున్నాక గంట దాటితే.. ఒక్కో గంటకు అదనంగా మరో రూ.100 చొప్పున కట్టాల్సి ఉంటుందని ఆలయ ఆఫీసర్లు తెలిపారు. కింద డబ్బు చెల్లించి కొండపైకి వచ్చిన వాహనాలకు బస్టాండ్, వీఐపీ గెస్ట్ హౌస్ వద్ద పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశామని చెప్పారు. వాహనాలకు డబ్బులు వసూలు చేయడానికి ప్రత్యేకంగా ఇద్దరు ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు.  

 

 

 

ఇవి కూడా చదవండి

లక్షల్లో ఫాలోవర్లు..ఒక్క పైసా తీసుకోడు 

మట్టి పాత్రలో ద్రాక్షపండ్లు..ఆరు నెలల వరకు చెడిపోవు

ఊరు చిన్నదే.. ఎంజాయ్​మెంట్​కు మాత్రం తక్కువ లేదు