లక్షల్లో ఫాలోవర్లు..ఒక్క పైసా తీసుకోడు 

లక్షల్లో ఫాలోవర్లు..ఒక్క పైసా తీసుకోడు 

‘‘కొండ ఎంత ఎత్తుగా ఉన్నా ఎక్కడం కష్టమేం కాదు.. పైన కలుద్దాం”– ఈ ఒక్క కోట్‌‌‌‌తో ఎంతోమంది ఎంట్రప్రెనూర్స్‌‌‌‌ జీవితాలను మార్చాడు సందీప్ మహేశ్వరి. ఆ కోట్‌‌‌‌ను బలంగా నమ్మి, ఆయన కూడా ఒక సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ ఎంట్రప్రెనూర్‌‌‌‌‌‌‌‌గా ఎదిగాడు. కొన్ని మిలియన్ల మందిని ఇన్‌‌‌‌స్పైర్‌‌‌‌‌‌‌‌ చేసి, మోటివేషనల్‌‌‌‌ స్పీకర్‌‌‌‌‌‌‌‌గా మారాడు. అంతేకాదు.. ఆయన సెమినార్లు జీవితాలను మారుస్తాయని చాలామంది చెప్తుంటారు. 

సందీప్ 1980లో పుట్టాడు. తండ్రి రూప్ కిషోర్ మహేశ్వరి. తల్లి శకుంతలా రాణి. అల్యూమినియం వ్యాపారం చేసే కుటుంబం. న్యూఢిల్లీలో ఉంటారు. చిన్నప్పటి స్నేహితురాలు రుచిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సందీప్‌‌‌‌. రుచి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న పర్సనల్‌‌‌‌ స్టైలిస్ట్. ఈ జంటకు ఒక కొడుకు, కూతురు. 

కిరోరి మాల్ కాలేజీలో బ్యాచిలర్‌‌‌‌‌‌‌‌ డిగ్రీలో చేరాడు సందీప్‌‌‌‌. కానీ.. మధ్యలోనే కామర్స్ డిగ్రి వద్దనుకుని చదువు మానేశాడు. తర్వాత రెండు వారాల పాటు ఫోటోగ్రఫీలో ఒక కోర్సు చేశాడు. ఆ తర్వాత ఫ్యామిలీ బిజినెస్‌‌‌‌లో చేరాడు. కానీ, ఆ బిజినెస్‌‌‌‌ తక్కువ టైంలోనే కుప్పకూలింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. దాంతో ఒక మార్కెటింగ్ ఏజెన్సీలో చేరాడు. ఆ తర్వాత బిజినెస్‌‌‌‌ గురించి మరింత తెలుసుకున్నాడు. తన 19 ఏండ్ల వయసులో మోడల్‌‌‌‌గా కెరీర్‌‌‌‌‌‌‌‌ని మొదలుపెట్టాడు. కానీ ఆ రంగంలో ఉన్న కొన్ని సమస్యల వల్ల మోడలింగ్‌‌‌‌ చేయడం మానేశాడు. 
మోడలింగ్‌‌‌‌లో ఆయన పడిన కష్టాలు ఇంకెవరూ పడొద్దని ‘మాష్ ఆడియో విజువల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఒక కంపెనీ పెట్టాడు. ఇందులో మోడల్స్‌‌‌‌ పోర్ట్‌‌‌‌ఫోలియోలను క్రియేట్‌‌‌‌ చేసేవాళ్లు. 2002లో మరో కంపెనీని పెట్టాడు. కానీ, అది పెద్దగా నడవలేదు. పెట్టిన ఆరు నెలల్లోనే మూతపడింది. 2003లో కన్సల్టెన్సీ ఏజెన్సీ మొదలుపెట్టి మార్కెటింగ్‌‌‌‌పై ఒక పుస్తకాన్ని రాశాడు. కానీ... అది కూడా ఫెయిల్‌‌‌‌ అయింది. చివరకు 2006లో ‘‘ఇమేజెస్‌‌‌‌ బజార్”అనే సంస్థను మొదలుపెట్టాడు. ఇదే అతని సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ లైఫ్‌‌‌‌కి మొదటి మెట్టు అయింది. 
బిజినెస్ బుర్ర
సందీప్‌‌‌‌ చిన్నప్పటినుంచి బిజినెస్‌‌‌‌ గురించే ఆలోచించేవాడు. అతనికి 13 ఏండ్ల వయసులో  ఫ్రెండ్‌‌‌‌కి తన తండ్రి స్కూటర్‌‌‌‌ని అద్దెకు ఇచ్చి డబ్బులు సంపాదించాడు. సందీప్‌‌‌‌ వాళ్ల నాన్నకు స్కూటర్ ఉండేది. అయితే.. సందీప్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌ ఒకతను తన గర్ల్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌ని రైడ్‌‌‌‌కి తీసుకెళ్లడానికి  స్కూటర్ అడిగాడు. గంటకు50 రూపాయల అద్దె తీసుకుని స్కూటర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. అప్పటినుంచే ప్రతీది బిజినెస్‌‌‌‌ మైండ్‌‌‌‌తో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఫొటోగ్రఫీలో కూడా అడుగు పెట్టాడు. 10 గంటల 45 నిమిషాల్లో 122 మంది మోడళ్లను పదివేల స్నాప్‌‌‌‌లు తీసి సరికొత్త ప్రపంచ రికార్డు క్రియేట్‌‌‌‌ చేశాడు.

ఈ ఫొటో షూట్ తర్వాతే సందీప్‌‌‌‌కు ‘‘ఇమేజెస్‌‌‌‌ బజార్‌‌‌‌‌‌‌‌’’ని మొదలుపెట్టాలనే ఐడియా వచ్చింది. అప్పటినుంచి మల్టీ టాస్కర్‌‌‌‌‌‌‌‌గా పనిచేయడం మొదలైంది. ఆ కంపెనీకి ఫొటోగ్రాఫర్, టెలీ మార్కెటర్, అడ్వైజర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశాడు. ఇమేజెస్‌‌‌‌ బజార్‌‌‌‌‌‌‌‌ అతిపెద్ద ఇండియన్‌‌‌‌ పిక్చర్స్ కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు ఈ కంపెనీకి 45 దేశాల నుంచి 7,000కు పైగా క్లయింట్స్‌‌‌‌ ఉన్నారు. 
డబ్బులు తీసుకోడు
సందీప్‌‌‌‌... తను చెప్పే సెమినార్లకు ఒక్క రూపాయి కూడా ఛార్జ్‌‌‌‌ చేయడు. అందుకే ఆయనంటే చాలామందికి ఇష్టం. ఆయన యూట్యూబ్ ఛానెల్‌‌‌‌ ‘సందీప్‌‌‌‌ మహేశ్వరి’కి 22.5 మిలియన్ల మంది సబ్‌‌‌‌స్క్రయిబర్లు ఉన్నారు. ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో 16 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన అనుకుంటే యూట్యూబ్‌‌‌‌ నుంచి నెలకు దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు సంపాదించొచ్చు. కానీ.. ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. సందీప్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ ప్రపంచంలోని లార్జెస్ట్‌‌‌‌ నాన్‌‌‌‌ మానిటైజ్డ్​ ఛానెల్స్‌‌‌‌లో ఒకటి. డబ్బులు ఎందుకు తీసుకోవడం లేదని అడిగితే.. ‘‘నలుగురికీ సాయపడాలనే ఉద్దేశంతో ఈ ఛానెల్‌ మొదలుపెట్టా. డబ్బు సంపాదించుకోవడానికి కాదు. అందుకే మానిటైజ్‌ చేయలేదు. నా వల్ల కొందరిలోనైనా మార్పు వస్తే  అదే చాలు. అందర్నీ సరైన మార్గంలో నడిపించాలనేదే నా లక్ష్యం” అని సమాధానం ఇచ్చాడు సందీప్‌.

 ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు అందుకున్నాడు. ఎంట్రప్రెనూర్ ఇండియా సమ్మిట్– 2013లో ‘ఎంట్రప్రెనూర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది ఇయర్‌‌‌‌‌‌‌‌” అవార్డు అందుకున్నాడు. గ్లోబల్ యూత్ మార్కెటింగ్ ఫోరమ్ అతనికి ‘‘స్టార్ యూత్ అఛీవర్” అవార్డు ఇచ్చింది. బ్రిటిష్ కౌన్సిల్ అతనికి ‘‘యంగ్ క్రియేటివ్ ఎంట్రప్రెనూర్ అవార్డు”ని కూడా ప్రదానం చేసింది. అవార్డులతో పాటు అనేక బిజినెస్ మ్యాగజైన్లలో సందీప్ గురించి కథనాలు వచ్చాయి. ‘హౌ టు కంట్రోల్ యువర్ మైండ్’, ‘రీసెర్చ్ ఆన్ ఇన్నర్ సౌండ్’, ‘ఎ స్మాల్ బుక్’ పుస్తకాలను  కూడా రాశాడు.