దోసకాయతో దోస్తీ చేస్తే ఆరోగ్యం మిమ్మల్ని వదిలివెళ్లదు. ఆరోగ్యాన్ని పెంచే విటమిన్లు, మినరల్స్ దోసకాయలో పుష్కలంగా ఉంటాయి. నిన్నమొన్నటి దాకా ఉన్న చలి వెళ్లి. ఇప్పడిప్పుడే వేడి పెరుగుతోంది. ఇలాంటప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచి ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ఈ దోస రుచులను ట్రై చేయండి
దోసకాయ, బీట్ రూట్ సలాడ్ తయారీకి కావలసినవి
- దోసకాయ ముక్కలు :అరకప్పు
- బీట్ రూట్ ముక్కలు: పావుకప్పు
- ఉల్లిపాయ తరుగు:పావుకప్పు
- వెల్లుల్లి తరుగు:ఒక టీస్పూన్
- ఆలివ్ ఆయిల్ :రెండు టీస్పూన్లు
- పుదీనా తరుగు: రెండు టీస్పూన్లు
- ఉప్పు: కొంచెం
- మిరియాల పొడి :కొంచెం.
- యోగర్ట్: అరకప్పు
దోసకాయ, బీట్ రూట్ సలాడ్ తయారీ విధానం
ఒక గిన్నెలో దోసకాయ. బీట్ రూట్ ముక్కలు ఉల్లి తరుగు వేసి కలపాలి. అందులో వెల్లుల్లి తరుగు అలివ్ ఆయిల్, పుదీన తరుగు, ఉప్పు, మిరియాల పొడి, యోగర్ వేసి బాగా కలిపి పది నిమిషాలు మారినేట్ చేసి సర్వ్ చేయాలి
దోసకాయ క్రీం తయారీకి కావలసినవి
- దోసకాయ: ఒకటి
- ఉల్లిపాయ: ఒకటి
- క్రీం :పావుకప్పు
- ఉప్పు: తగినంత
- పసుపు: చిటికెడు
- కారం: ఒక టీస్పూన్
- ఎండుమిర్చి: రెండు
- తాలింపు గింజలు :ఒక టీస్పూన్
- నూనె: రెండు టీస్పూను
దోసకాయ క్రీం తయారీ విధానం
పాన్లో నూనె వేడిచేసి తాలింపుగింజలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేగించి.. తర్వాత దోసకాయ ముక్కలు చేర్చి, పసుపు వేసి కలిపి మూత పెట్టాలి.
దోసకాయ మెత్తగా అయ్యాక ఉప్పుకారం కలపాలి. రెండు నిమిషాలయ్యాక క్రీం కూడా కలిసి పాన్ దించేస్తే సరిపోతుంది.ఆవేడికి క్రీం కూరలో కలుస్తుంది
దోసకాయ, పుచ్చకాయ జ్యూస్ తయారీకి కావాల్సినవి
- దోసకాయ ముక్కలు: ఒక కప్పు
- పుచ్చకాయ ముక్కలు ఒక కప్పు
- తేనె: అర స్పూన్
- ఉప్పు: చిటికెడు
- జీలకర్ర: అర టీస్పూన్
- పుదీనా ఆకులు : నాలుగు
దోసకాయ, పుచ్చకాయ జ్యూస్ తయారీ విధానం
ఒక జ్యూసర్లో దోసకాయ, పుచ్చకాయ ముక్కలు వేసి జ్యూస్ తీయాలి. దీనికి అర స్పూన్ తేనె చిటికెడు ఉప్పుకలపాలి.తర్వాత కొంచెం జీలకర్ర, తాజా పుదీనా ఆకులను కూడా కలపాలి. అవసరమనుకుంటే ఇందులోకి కొద్దిగా నిమ్మకాయ రసనం వేసుకోవచ్చు.
