తొమ్మిది ఇండ్లలో చోరీ...నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో దొంగల బీభత్సం

తొమ్మిది ఇండ్లలో చోరీ...నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో దొంగల బీభత్సం

వర్ని, వెలుగు: నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం శ్రీనగర్​లో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రాత్రి తొమ్మిది ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తొమ్మిది ఇళ్లల్లో చొరబడి బీరువాలు, లాకర్లు పగులగొట్టి నగదు, ఆభరణాలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న సీసీఎస్​ ఏసీపీ మస్తాన్​ అలీ, ఎస్సై వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రెండిళ్లల్లో నాలుగు తులాల ఆభరణాలు, రూ.20 వేలు నగదు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. మిగిలిన ఏడు ఇళ్లల్లో చోరీకి విఫలయత్నం చేశారని పేర్కొన్నారు.