నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ శివారులోని మోపాల్‒సిర్పూర్ రోడ్ పక్కనున్న ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఒక రోజు వయస్సున్న ఆడ శిశువును వదిలివెళ్లారు. బుధవారం మధ్యాహ్నం అటుగా వెళ్తున్న కూలీలకు పాప ఏడుపు వినిపించడంతో పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు.
అంబులెన్స్ స్టాఫ్ శిశువును మాతాశిశు హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్ల పర్యవేణలో ఉన్న పాప కోలుకుంటున్నది. కొత్త టవర్‌ల్లో చుట్టి ముళ్లపొదల్లో పడేసిన శిశువు కుక్కల కంట పడకపోవడంతో హానీ జరగలేదు. మోపాల్ పోలీస్‌లు దర్యాప్తు చేపట్టారు.
