చిలకడదుంప.. అదేనండీ స్వీట్ పొటాటో వీటిని చాలామంది బంగాళ దుంప తిన్నంత ఇష్టంగా తినరు. అలాంటి వారు ఎన్నో పోషకాలు మిస్ అయినట్టే.. వీటిని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా.. ఆయుర్వేదంలో ఈ చిలగడదుంపల గురించి ఏం చెబుతుందంటే.. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను (UTIs) తగ్గించడంలో కూడా ఈ చిలగడ దుంపలు ఉపయోగపడతాయి. సూప్ రూపంలో వీటిని తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
అంతే కాక ఇందులో ఉన్న విటమిన్ సి.. జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హైబీపీతో బాధపడేవారు చిలకడ దుంపను తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం గుండె పనితీరును మెరుగుపరచి... బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. కీళ్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చిలగడ దుంపను నీళ్లలోనే ఉడికించుకుని, ఆవిరితో ఉడికించి తింటారు. ఇందులో నూనె వాడకం అవసరం ఉండదు. అందువల్ల.. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
►ALSO READ | లైఫ్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న నటి: అన్నీ దాటుకుని రెండు నేషనల్ అవార్డ్స్ సొంతం.. ఎవరీ కొంకణ సేన్ శర్మ?
చిలకడదుంపలో ఉన్న కెరటనాయిడ్స్ రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ని నియంత్రిస్తుంది.మధుమేహంతో బాధపడేవారు చిలగడదుంపను ఎలాంటి అనుమానం లేకుండా తినవచ్చు. ఇందులో ఉండే పోషకాలు మధుమేహం ఉన్న వారికి ఎన్నో విధాలుగా సహాయపడతాయి.
ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది.ఈ ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. చిలకడ దుంపలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల తొందరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీనితో ఎక్కువ తినాలనే కోరిక తగ్గిపోతుంది. ఎవరైతే తొందరగా బరువు తగ్గాలని కోరుకుంటూ ఉంటారో, వారికి ఇది మంచి ఆహారం. ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
