సినిమా ఇండస్ట్రీలో నటన, దర్శకత్వం, రచన ఇలాంటి డిపార్ట్మెంట్స్లో తమ సత్తా చూపించిన కొంతమంది మహిళల్లో ఈ బాలీవుడ్ నటి పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఈమె ఎవరో కాదు.. కొంకణ సేన్ శర్మ (Konkona Sen Sharma). చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె జాతీయ ఉత్తమ నటిగా అప్పట్లోనే రికార్డ్ క్రియేట్ చేసింది. రకరకాల డిపార్ట్మెంట్స్లో పని చేసిన ఆమె ప్రతిదాంట్లోనూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఇప్పటికీ తన పాత్ర, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న కొంకణ సేన్ జర్నీలో కొన్ని విశేషాలు ఇవి.
సైన్స్ రైటర్, జర్నలిస్ట్ ముకుల్ శర్మ, యాక్ట్రెస్, ఫిల్మ్ డైరెక్టర్ అపర్ణ సేన్ దంపతుల కూతురు కొంకణసేన్ శర్మ. ఆమె తల్లి తరపు వాళ్లలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవాళ్లు ఉన్నారు. అందువల్ల కొంకణ కూడా చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగింది. ఆమె మొట్టమొదటిసారి ఇందిర అనే బెంగాలీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసింది. తర్వాత టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆమోదిని అనే సినిమాలో నటించింది.
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చదువుకున్న ఆమె ఇంగ్లిష్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది. అదే సంవత్సరం ఎక్ జె ఆచ్చే కన్యా అనే బెంగాలీ సినిమాతో మరోసారి డెబ్యూగా నెగెటివ్ రోల్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే టిట్లీ సినిమాలో తన తల్లితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాలన్నీ ఆమెకు బెంగాలీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చిపెట్టాయి.
అలాగే ఇంగ్లిష్ భాషలో మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ అనే డ్రామాలో నటించి ఫేమ్‌ను సొంతం చేసుకుంది. అందులో ఆమె తమిళ ఇంటి ఇల్లాలుగా కనిపించి దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ నటిగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను అందుకుంది. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఇప్పటికీ ఆమె నటించిన సినిమాలకు ఒకటి లేదా రెండు అవార్డులు ఆమె ఖాతాలో వేసుకుంటూనే ఉంది.
అయితే, తన సినీ వృత్తి పరంగా లైఫ్లో సక్సెస్ అయింది. కానీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతగా విజయవంతం కాలేదు. కొంకణా 2007లో రణవీర్ షోరేతో డేటింగ్ చేసి, 2010లో అతన్ని కోంకణా పెళ్లి చేసుకుంది. 2011 సంవత్సరంలో, కొంకణా కొడుకు హరూన్‌కు పుట్టాడు. ఇక పెళ్లైన పదేళ్ల తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు.
డైరెక్టర్‌గా..
కొంకణ సేన్ తల్లిలానే నటి మాత్రమే కాదు.. డైరెక్టర్ కూడా. మొదట నామ్కొరొన్ అనే సినిమాతో డైరెక్టర్ అయింది. 2017లో ఏ డెత్ ఇన్ ద గంజ్ అనే సినిమా కథ రాసి, డైరెక్ట్ చేసింది. ఈ సినిమా ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ అయింది. రీసెంట్గా 2023లో ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లో ఆంథాలజీ ఫిల్మ్ సెగ్మెంట్ : ది మిర్రర్ కథ రాసి, డైరెక్ట్ చేసింది.
సీరియల్స్‌లోనూ..
కొంకణ సేన్ శర్మ మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది సినిమాలో కాదు.. ‘పిక్నిక్’ అనే బెంగాలీ సీరియల్లో. ఆ తర్వాత ఒక సినిమాలో నటించిన ఆమె అప్పుడప్పుడు టీవీ షోల్లో, మినీ సిరీస్‌లలో నటించింది. తన తల్లి డైరెక్ట్ చేసిన కామెడీ హారర్ ఫిల్మ్‌లో ఒక పాట పాడింది. తర్వాత వేరే రెండు ప్రాజెక్ట్స్‌కు ఆమె పాటలు పాడింది.
అంతేకాదు.. లేటెస్ట్గా వచ్చిన ఓటీటీల్లోనూ ఆమె యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తోంది. 2020 నుంచి 2023 వరకు ముంబై డైరీస్, తర్వాత కిల్లర్ సూప్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో మెట్రో ఇన్ దినోలో తన పర్ఫార్మెన్స్తో అట్రాక్ట్ చేసింది. అలాగే సెర్చ్ : ద నైనా మర్డర్ కేస్‌లో ఏసీపీ సంయుక్తా దాస్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించింది.
కథను బట్టి బడ్జెట్ నిర్ణయించరు. పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమా తీస్తున్నప్పుడు, చాలామంది వస్తారని అంచనాలు ఉంటాయి. అలాంటప్పుడు అవసరం లేని చోట కూడా ఖర్చు పెట్టడం వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇతర దేశాల్లో వారానికి నాలుగు రోజులే పనిదినాలు అని రూల్ వచ్చింది. దాంతో వాళ్ల ప్రొడక్టివిటీ కూడా బాగా పెరిగింది. మన దగ్గర కూడా కొందరు ఇండస్ట్రీకి సంబంధించినవాళ్లు పని గంటల గురించి డిబేట్ చేస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం, పని చేసే తల్లులకే కాదు.. ముందుగా సెట్‌కు వచ్చి, చివరిగా ఇంటికి వెళ్లే ప్రతి టెక్నీషియన్కూ వర్కింగ్ అవర్స్ ఒకేలా ఉండాలి.
సెర్చ్ సిరీస్ గురించి..
ఈ సిరీస్‌లో నా పాత్రకు చాలా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను రియల్ లైఫ్‌లోనూ ఒక తల్లిగా ఎన్నో చాలెంజెస్ ఎదుర్కొంటుంటాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో చాలా రిలేట్ అయ్యాను. మిగతా పాత్రలతో పోలిస్తే నా క్యారెక్టర్‌తో నేను కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అయింది. అందులో కొన్నిసార్లు నా రియల్ లైఫ్‌కు సంబంధం లేకపోవచ్చు. కానీ, ఏదో ఒక పాయింట్లో నేను ఆ పాత్రకు కనెక్ట్ అవుతాను. నిజానికి నేను నా కెరీర్ బిగినింగ్‌లోనే తల్లి పాత్రలో నటించాను.
అయితే ఏ పాత్ర చేయాలన్నా ముందు స్క్రిప్ట్ చదివేటప్పుడే అది మనకు సరైనదా? కాదా? అని తెలిసిపోతుంటుంది. స్క్రిప్ట్‌లో ఎక్కడా బ్రేక్ రాకుండా చదవగలిగితే అంతే ఈజీగా పాత్రలో ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. సరిగా రాయకపోతే చదివేటప్పుడే ఎక్కడో తేడా కొడుతుంది అనిపిస్తుంటుంది. అది చదవలేకపోయాను అంటే తర్వాత దాన్ని స్క్రీన్ మీద కూడా చూడడం కష్టతరం అవుతుంది.
