ఆగని బస్సు ప్రమాదాలు… పోతున్న ప్రాణాలు

ఆగని బస్సు ప్రమాదాలు… పోతున్న ప్రాణాలు

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా ప్రభుత్వం కార్మికులను విధులలోకి తీసుకోకపోవడంతో ఇప్పటికీ తాత్కాలిక డ్రైవర్లే బస్సులను నడుపుతున్నారు. దీంతో పలు చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సమ్మె జరిగిన 53రోజులలో 30 ప్రమాదాలు జరిగాయి. ఇందులో పలువురు చనిపోయారు. ప్రమాదాలు జరగడం మాత్రం ఆగుతలేవు…

తాజాగా..జరిగిన ప్రమాదాలు.. 
పెద్దపెల్లి జిల్లా.. మంథని నుండి ముత్తారం మండలంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో ప్రయాణిస్తున్న విధ్యార్థులకు గాయాలయ్యాయి.

ఖమ్మంపల్లి అడవిశ్రీరాంపూర్ లో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో బస్సు నడుపుతున్న తాత్కాలిక బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కొత్త బస్టాండ్ సమీపములో బైక్ ను ఢీకొంది ఓ ఆర్టీసి బస్సు. ఈ ప్రమాదంలో సాంబారి మల్లేష్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల కు తరలించారు స్థానికులు.