ఘట్‌కేసర్, వెలుగు: వెనుక నుంచి స్పీడ్‌గా వస్తున్న కార్లను చూసి పక్కకు జరిగే క్రమంలో ఓ ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి ఎక్కింది. ఈ ఘటన వరంగల్– హైదరాబాద్ నేషనల్ హైవేపై జరిగింది.
శుక్రవారం హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ డీలక్స్ బస్సు 28 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఘట్‌కేసర్ సమీపంలోని ఔషాపూర్ వద్దకు రాగానే.. వెనుక నుంచి హైస్పీడ్‌తో రెండు కార్లు రావడాన్ని బస్సు డ్రైవర్ గమనించాడు.
తమను ఢీకొడుతాయన్న భయంతో బస్సును రోడ్డు పక్కకు నెమ్మదిగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలో బస్సు డివైడర్ పైకి ఎక్కింది. బస్సు స్లోగా ఉండడంతో, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సు ముందు భాగం స్వల్పంగా ధ్వంసమైంది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సును పక్కకు తీసుకెళ్లకుంటే రెండు కార్లు బస్సును ఢీకొట్టేవని స్థానికులు చెప్పారు.
