
హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. కైఫ్ ఉడ్ ట్రేడర్స్ యజమాని ఆరిఫ్ అక్బర్‌ను నలుగురు దుండగులు కారులో ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా షాప్‌లో ఉన్న 50 లక్షల విలువైన కలపను కూడా దొంగిలించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని దుండగులు మేడ్చల్‌లో వదిలేసి వెళ్లారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు ఆరు ప్రత్యేక టీములతో గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌కు కారణంగా తెలుస్తోంది. కిడ్నాపర్లు మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు సమాచారమందడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు నాగ్‌పూర్ వెళ్లారు.