‘బుట్ట బొమ్మ’ మూవీ టీజర్‌‌‌‌ లాంచ్

‘బుట్ట బొమ్మ’ మూవీ టీజర్‌‌‌‌ లాంచ్

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లీడ్‌‌ రోల్స్‌‌లో శౌరి చంద్రశేఖర్ రమేష్  దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బుట్ట బొమ్మ’. సితార ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌‌ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్ బర్త్‌‌ డే సందర్భంగా సోమవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను లాంచ్ చేశారు.

‘మళ్లీ ఎప్పుడు కాల్ చేస్తావ్...  ఇంకోసారి చెయ్యాలంటే  ఇప్పుడు కాల్ కట్ చెయ్యాలి గా’.. ‘మాటింటే మనిషిని చూడాలనిపించాలి, మాట్లాడుతుంటే పాట ఇంటున్నట్టుండాలి’ లాంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ‘గ్రామీణ నేపథ్యంలో మనసుకు హత్తుకునేలా ఈ ప్రేమ కథను తెరకెక్కిస్తున్నాం. పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉండి గుర్తుండిపోతాయి. అనిక, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నటన ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు దర్శకుడు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. నవ్య స్వామి, నర్రా శ్రీను, పమ్మి సాయి, మిర్చి కిరణ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.